పశ్చిమాసియాలో యుద్ధం.. శంషాబాద్ నుంచి 12 విమానాలు రద్దు

  • గల్ఫ్ దేశాలకు వెళ్లవలసిన విమానాలు రద్దైనట్లు అధికారులు వెల్లడి
  • గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన 12 కూడా విమానాలు రద్దయ్యాయన్న అధికారులు
  • ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన విమానాలు రద్దు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లవలసిన 12 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు ఆర్జీఐఏ అధికారులు వెల్లడించారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో విమానాల రద్దు కొనసాగుతోంది.

శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన విమానాలతో పాటు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన మరో 12 విమానాలు కూడా రద్దయ్యాయి. ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన విమానాలు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 23 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనితో విమానయాన సంస్థలకు రూ.100 కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9,165 కోట్లు. భారత విమానయాన సంస్థలపై కూడా ఈ ప్రభావం అధికంగానే ఉంది.

Shamshabad Airport
Rajiv Gandhi International Airport
Hyderabad Airport
Flight Cancellations

More Telugu News